టీడీపీ డిజిటల్ మహానాడులో ఏపీ, తెలంగాణలపై నేడు పలు తీర్మానాలు
- టీడీపీ డిజిటల్ మహానాడు కార్యక్రమం రెండోరోజు ప్రారంభం
- నేడు ఏపీకి సంబంధించి నాలుగు తీర్మానాలపై చర్చ
- తెలంగాణకు సంబంధించి మూడింటిపై
- ఉమ్మడిగా మరో మూడు తీర్మానాలు
టీడీపీ డిజిటల్ మహానాడు కార్యక్రమం రెండోరోజు ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు మొత్తం పదిహేను తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మహానాడులో మొత్తం 10 తీర్మానాలపై చర్చించనున్నారు.
ఇందులో ఏపీకి సంబంధించి నాలుగు, తెలంగాణకు మూడు, ఉమ్మడిగా మరో మూడు తీర్మానాలు ఉన్నాయి. ఏపీలో ముందుకు కొనసాగకుండా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టు, వ్యవసాయం పరిస్థితులు, సంక్షేమం, నకిలీ నవరత్నాలు, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, బిల్లుల పెండింగ్, ప్రత్యేక హోదా వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే, తెలంగాణలో ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు, విద్యారంగం, మహిళా వికాసం వంటి అంశాలపై తీర్మానాలు చేస్తారు.