తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో చర్చలు ప్రారంభం
- నిన్నటి నుంచి జూడాల సమ్మె
- నిన్న చర్చలు విఫలం
- బీర్కే భవన్‌లో నేడు మరోసారి భేటీ
- సమావేశం తర్వాత ప్రకటన చేయనున్న జూడాలు
తమ డిమాండ్లపై కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదంటూ నిన్నటి నుంచి విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం నిన్న జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ రోజు మరోసారి చర్చలు జరుపుతోంది.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం జూనియర్ డాక్టర్లతో బీఆర్కే భవన్‌లో భేటీ అయింది. తమ డిమాండ్లను జూనియర్ డాక్టర్లు వివరిస్తున్నారు. ఈ చర్యల అనంతరం వారు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.