కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన స్టాలిన్

  • ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
  • రైతులతో కేంద్రం నిర్మాణాత్మక చర్చలు జరపలేదు
  • రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 6 నెలలు పూర్తి చేసుకున్నాయి. రైతులకు పలు పార్టీలు, రాష్ట్రాల ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరుస్తామని చెప్పారు.

రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు గడిచినా.. వారితో ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన చర్చలు జరపలేదని స్టాలిన్ విమర్శించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని చెప్పారు. రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని... వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News