వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తోంది.. మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్

  • ఆమె ఎవరో తనకు తెలియదన్న ఎమ్మెల్యే
  • చాతర్‌పూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తనతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించిందని, ఆపై ఆ క్లిప్పింగులు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, గతంలోనూ ఆమె నంబరు నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 తాను కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఆ మహిళ తనకు వీడియో కాల్ చేసిందని, ఆమె అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే కాల్ కట్ చేసినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న గర్హి మలేహరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో క్లిప్ చూపించి ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆమె ఎంత మొత్తం డిమాండ్ చేసిందన్న దానిపై విచారణ చేపట్టినట్టు డీఎస్పీ శశాంక్ జైన్ తెలిపారు. నీరజ్ దీక్షిత్ చాతర్‌పూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గానికి చెందిన మహిళే ఈ పనిచేస్తున్నట్టు శశాంక్ అనుమానం వ్యక్తం చేశారు.


More Telugu News