మరో తమిళ మూవీ రీమేక్ లో చిరూ?
- ముగింపు దశలో 'ఆచార్య'
- తదుపరి సినిమాగా 'లూసిఫర్' రీమేక్
- బాబీ దర్శకత్వంలోను సినిమా
- 'సాహో' దర్శకుడికి ఛాన్స్
చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపుదశకు చేరుకుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత ఆయన 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఆ తరువాత 'వేదాళం' రీమేక్ బాధ్యతలను మెహర్ రమేశ్ కి అప్పగించినట్టుగా వార్తలు వచ్చాయి.
ఇక బాబీ దర్శకత్వంలోను తాను ఒక సినిమా చేయనున్నట్టుగా చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే బాబీ ఉన్నారు. ఆ తరువాత సినిమాను కూడా చిరంజీవి లైన్లో పెట్టేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది .. అది అజిత్ హీరోగా చేసిన 'ఎన్నై అరిందాళ్' సినిమాకి రీమేక్. 'ఎంతవాడుగానీ' పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదలైంది కూడా. అయినా చిరూ ఈ సినిమా రీమేక్ పట్ల ఉత్సాహాన్ని చూపించారట. ఈ సినిమా బాధ్యతను ఆయన 'సాహో' దర్శకుడు సుజీత్ కి అప్పగించారని అంటున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ పై సుజీత్ కసరత్తు మొదలెట్టేశాడట!