మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

  • నిన్న రూ. 48,062 వద్ద ముగిసిన బంగారం ధర
  • నేడు పది గ్రాములకు రూ. 527 పెరిగిన వైనం
  • వెండి ధర కిలోకు రూ.1,043 పెరుగుదల
పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 527 పెరిగి రూ. 48,589కు చేరింది. ఎప్పుడూ బంగారం బాటలోనే పయనించే వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలోకు ఏకంగా రూ. 1,043 పెరిగి రూ. 71,775కు చేరింది. పుత్తడి ధర నిన్న రూ. 48,062 వద్ద ముగిసింది. మరోవైపు, అంతర్జాతీయంగానూ పసిడికి డిమాండ్ పెరిగింది.

ఔన్సు బంగారం ధర 1,908 డాలర్లుగా ఉండగా, వెండి ధర ఔన్సుకు 28.07 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,700గా ఉంది. డాలర్ సూచీ ఐదు నెలల కనిష్ఠానికి పడిపోవడానికి తోడు యూఎస్ 10 ఇయర్ ట్రెజరీ ఈల్డ్స్ 1.56 శాతం తగ్గడంతో మదుపరులు బంగారంపై పెట్టుబడికి మొగ్గుచూపారు. ఫలితంగా పసిడి ధరలు ఎగబాకాయి.


More Telugu News