30న తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
- రాష్ట్రంలో వ్యవసాయం, ధాన్యం సేకరణపై చర్చ
- విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలపై భేటీ
- పాల్గొననున్న సోమేశ్ కుమార్, ఇతర అధికారులు
తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 30న ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపు లేదా ఆంక్షల సడలింపు వంటి వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాలపై కేబినెట్ చర్చించనుందని తెలంగాణ సీఎంవో తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ భేటీలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు.