ధూళిపాళ్లను పరామర్శించిన లోకేశ్.. వైసీపీపై ఆగ్రహం
- పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడం తప్పా?
- 50 శాతం రాయితీతో వైద్యం అందిస్తున్నారు
- టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది
- ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు
సంగం డెయిరీ కేసులో అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలై విజయవాడలోని తన ఇంట్లో ఉంటోన్న ధూళిపాళ్లను ఈ రోజు టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ... పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడం ధూళిపాళ్ల చేసిన తప్పా? అని నిలదీశారు.
ఆయన ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందిస్తున్నారని నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అన్నారు. పాడి పరిశ్రమను గుజరాత్‌కు అమ్మేందుకు కుట్ర చేస్తోందని, ఒంగోలు డెయిరీని ఇప్పటికే అమూల్‌కు అప్పగించారని ఆయన చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాడుతుంటే ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒకవైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే జగన్ మాత్రం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంలో బిజీగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.