పలు జిల్లాలకు ఆక్సిజన్, కాన్సన్ ట్రేటర్లు పంపిన చిరు.. మిషన్ ప్రారంభమైందని ట్వీట్
- పలు జిల్లాలకు ఈ రోజు సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు
- చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల దిగుమతి
- చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ
కరోనా వేళ దేశంలో ఆక్సిజన్ కొరతతో చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సినీ నటుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి.
కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ ను పంపారు. అలాగే అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ రోజు సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను పంపారు.
అలాగే, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో ఈరోజు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. మిషన్ ప్రారంభమైందని, ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని ఆయన అన్నారు.
తన ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఆర్డర్ చేశామని వివరించారు. అత్యవసరంగా ఎక్కడ ఆక్సిజన్ అవసరం ఉందో తెలుసుకొని అక్కడకు సిలిండర్లు అందిస్తున్నామన్నారు.
చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. తన కుమారుడు రామ్ చరణ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నాడని తెలిపారు.