దేశంలో నిన్న 4,157 మంది క‌రోనాతో మృతి

  • కొత్త‌గా 2,08,921 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,71,57,795
  • మృతుల సంఖ్య మొత్తం 3,11,388
  • 20,06,62,456 మందికి వ్యాక్సిన్లు  
దేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,08,921 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 2,95,955 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,71,57,795కు చేరింది. మరో  4,157  మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,11,388 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,43,50,816 మంది కోలుకున్నారు. 24,95,591 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,06,62,456 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 33,48,11,496 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 22,17,320 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


More Telugu News