ఒడిశా, బెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోన్న యాస్ తుపాను.. వీడియో ఇదిగో
- అతి తీవ్ర తుపానుగా మారిన యాస్
- ఒడిశాలోని భద్రక్ జిల్లాలో తుపాను ప్రభావం అధికం
- బెంగాల్‌లోని దిగా తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న అలలు
- మొత్తం 11 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుపాను అతి తీవ్ర తుపానుగా మారిన విషయం తెలిసిందే. ఒడిశాలో తుపాను ప్రభావం అధికంగా వుండడంతో బీభత్సం సృష్టిస్తోంది. చాందీపూర్, బాలాసోర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
రోడ్డుపైకి సముద్రపు నీరు వచ్చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి తుపాను ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకనుంది.
ప్రస్తుతం పారాదీప్‌కు తూర్పు ఈశాన్య దిశగా 90 కిలోమీటర్ల దూరంలో, బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 50 కిలోమీటర్ల దూరంలో, దిగాకు 90 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్య తీరాన్ని తుపాను తాకనుంది. ఇప్పటికే అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, తుపాను ప్రభావంతో ఝార్ఖండ్, బీహార్, అసోం, మేఘాలయాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.