అదానీ సెజ్‌లో గంగవరం పోర్టును విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

  • పోర్టును అభివృద్ధి చేసిన డీవీఎస్ రాజు కన్సార్టియం
  • ప్రభుత్వ వాటా 10.4 శాతాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ఏపీ సెజ్ ప్రతిపాదన
  • నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
విశాఖ గంగవరం పోర్టులో మెజారిటీ వాటాను దక్కించుకున్న అదానీ పోర్ట్స్ ఇప్పుడా పోర్టును తమ సంస్థలో విలీనం చేసుకోనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ధి చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.10 శాతం, విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్‌కు 31.5 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది.

మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును పూర్తిగా సొంతం చేసుకునేందుకు ఏపీ సెజ్ ప్రతిపాదించింది. స్పందించిన ప్రభుత్వం వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, పోర్టును ఏపీ సెజ్‌లో విలీనానికి కూడా అనుమతి నిచ్చింది.


More Telugu News