బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారిన 'యాస్'
- బంగాళాఖాతంలో యాస్ తుపాను
- ఈ సాయంత్రం తీవ్ర తుపానుగా మారిన వైనం
- కొన్ని గంటల్లో మరింత బలపడిన యాస్
- ఒడిశా, బెంగాల్ తీరాల దిశగా పయనం
- రేపు మధ్యాహ్నం తీరం దాటనున్న తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ సాయంత్రం తీవ్ర తుపానుగా బలపడిన యాస్... కొన్ని గంటల్లోనే మరింత శక్తిమంతం అయింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్ కు దక్షిణంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నం పారాదీప్, సాగర్ ఐలాండ్స్ మధ్య తీరం దాటనుంది.
తీరం చేరే సమయంలోనూ యాస్ అతి తీవ్ర తుపాను స్థాయిలోనే ఉంటుందని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 165 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.