మహానాడు నిర్వహణపై టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
- రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు
- ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు
- ఈసారి కూడా ఆన్ లైన్ లోనే నిర్వహణ
- తీర్మానాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
త్వరలో మహానాడు నిర్వహించడంపై టీడీపీ అధినాయకత్వం పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు కోరుతోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ మహానాడులో పలు తీర్మానాలు చేయనున్నారు.
కాగా, గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మహానాడు ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఏడాది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి (మే 28) కలిసొచ్చేలా మహానాడు జరపడం తెలిసిందే.