ఆనందయ్య భార్యను సన్మానించిన టీడీపీ నేతలు... వీడియో ఇదిగో!

  • విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఆనందయ్య మందు
  • మందు పంపిణీని నిలిపివేసిన సర్కారు
  • మందుపై కొనసాగుతున్న అధ్యయనం
  • కృష్ణపట్నంలో పర్యటించిన టీడీపీ బృందం
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో మొదలైన ఆనందయ్య కరోనా ఔషధం పేరుప్రఖ్యాతులు ఇప్పుడు రాష్ట్రమంతటా పాకిపోయాయి. ఇప్పుడాయన మందు శాస్త్రీయతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు కృష్ణపట్నంలో పర్యటించి ఆనందయ్య కుటుంబసభ్యులను కలుసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, పి.శ్రీనివాసులురెడ్డి తదితరులు ఆనందయ్య అర్ధాంగిని సన్మానించారు.

అంతకుముందు టీడీపీ నేతలు ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. అదే సమయంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఓ విద్యార్థి తీవ్ర అస్వస్థతతో అక్కడికి రాగా, సోమిరెడ్డి సమక్షంలోనే ఆనందయ్య కుటుంబ సభ్యులు ఆ విద్యార్థి కంట్లో చుక్కలు వేశారు. దాంతో కొద్దిసేపటికే ఆ విద్యార్థి లేచి కూర్చున్నాడు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, ఆనందయ్య మందును ఎందుకు ఆపారో తెలియదు, ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నారు అంటున్నారని విమర్శించారు. ఈ మందును కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాము మందుపై అధ్యయనం చేయవద్దనడంలేదని, మందును ఆపవద్దంటున్నామని స్పష్టం చేశారు.


More Telugu News