తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల
- ఈ నెల 25 నుంచి తొలి విడత అడ్మిషన్లు
- జులై 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
- జూన్ 1 నుంచే ఆన్ లైన్ క్లాసులు
- త్వరలోనే రెండో విడత అడ్మిషన్ల ప్రకటన
తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి గాను ఈ నెల 25 నుంచి జులై 5 వరకు తొలి విడత అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
ఈ నెల 25 నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు వారి ఎస్ఎస్ సీ మార్కుల జాబితాలను సమర్పించాక ఇంటర్ అడ్మిషన్ నిర్ధారణ అవుతుంది. జూన్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు చేపట్టనున్నారు. ఇక, రెండో విడత అడ్మిషన్ల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్య బోర్డు షెడ్యూల్ లో పేర్కొంది.