చిరూ నిర్ణయం ప్రకారమే చరణ్ పాత్ర ముగింపు?
- ముగింపు దశలో 'ఆచార్య'
- సిద్ధా పాత్రపై ఊహాగానాలు
- ప్రత్యేక ఆకర్షణగా మణిశర్మ సంగీతం
- త్వరలోనే కొత్త రిలీజ్ డేట్
చిరంజీవి .. కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'సిద్ధా 'అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఉద్యమ బాటలో ఉరకలేసే ఈ పాత్ర, ఆశయసాధన కోసం ప్రాణాలను అర్పిస్తుందట. ఈ ఎమోషనల్ సీన్ ను తెరపై చూపించాలని కొరటాల అనుకుంటే, అందుకు చిరంజీవి నిరాకరించారనే ఒక టాక్ వినిపిస్తోంది. 'సిద్ధా' పాత్ర చనిపోవడాన్ని తెరపై చూపించడం వలన, ఆడియన్స్ వేరే మూడ్ లోకి వెళ్లిపోతారనీ, అందువలన ఆ పాత్ర ముగింపు సున్నితంగానే ఉండాలనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారని అంటున్నారు.
చిరంజీవి చేసిన సూచన ప్రకారమే, ఆడియన్స్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా 'సిద్ధా' పాత్ర ముగింపును కొరటాల చిత్రీకరించాడని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటిస్తుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఒకే తెరపై చిరూ .. చరణ్ లను చూసే సమయం కోసం మెగా అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.