ఏమిటీ కండకావరం? పేదల నోటికాడ కూడు తీస్తారా?: అచ్చెన్నాయుడు
- పేదల ఆకలిని తీర్చడమే శివశక్తి ఫౌండేషన్ తప్పా?
- ప్రజలకు సేవ చేసే సంస్థలను వీలైతే ప్రోత్సహించండి
- ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అచ్చెన్నాయుడు ఫైర్
శివశక్తి ఫౌండేషన్ కు సంబంధించి వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 'బ్రహ్మనాయుడూ ఏమిటి ఈ కండకావరం?' అని ప్రశ్నించారు. పేదల నోటికాడి కూడును కూడా లాగేస్తారా? అని మండిపడ్డారు. పేదల ఆకలిని తీర్చడమే శివశక్తి ఫౌండేషన్ తప్పా? అని ప్రశ్నించారు.
రాజకీయ దురుద్దేశాలతో స్వచ్ఛంద సేవా సంస్థలను అడ్డుకోవడం తప్పని హితవు పలికారు. ప్రజలకు సేవ చేసే సంస్థలను వీలైతే ప్రోత్సహించాలని... లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పలువురు దాతలు ఇస్తున్న ఆక్సిజన్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదా?' అని ప్రశ్నించారు. మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు.