యాస్ తుపాను ప్రభావం.. తెలంగాణకు వర్షసూచన

  • తీవ్ర తుపానుగా మారిన యాస్
  • రేపు తెల్లవారుజామున తీరాన్ని తాకనున్న తుపాను
  • తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీవ్ర తుపానుగా మారింది. తూర్పు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతూ... పారాదీప్ కు ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా ఇది అవతరించనుంది. రేపు తెల్లవారుజామున పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలైన చాంద్ బలి, ధర్మా పోర్ట్ ల మధ్య ఇది తీరాన్ని తాకనుంది.

ఈరోజు విషయానికి వస్తే... వాయవ్య, ఉత్తర దిశల నుంచి తక్కువ స్థాయి గాలులు తెలంగాణ మీదకు వస్తున్నాయి. అయితే, రాగల మూడు రోజుల పాటు యాస్ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


More Telugu News