ఏపీలో రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు.. రైతుల ఖాతాల్లో రూ.1820 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి!
- ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత పంటల బీమా చెల్లింపుల కార్యక్రమం
- గత ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మందికి పరిహారం
- రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న జగన్
- 23 నెలల్లో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత పంటల బీమా చెల్లింపుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. గత ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు రూ.1820.23 కోట్ల బీమా పరిహారాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలతో రైతులు నష్టపోయారని చెప్పారు. వారిని ఆదుకునేందుకు తాము ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా కింద ఈ నెలలో రూ.3,900 కోట్లు అందించామని తెలిపారు.
ఈ రోజు 15.15 లక్షల మంది రైతులకు రూ.1820 కోట్లు ఇస్తున్నామని జగన్ వివరించారు. రైతులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం భరిస్తోందని చెప్పారు. ప్రతి ఆర్బీకే కేంద్రంలో లబ్ధిదారుల జాబితాను ఉంచుతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం 23 నెలల్లో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
తమ ప్రభుత్వం గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని జగన్ తెలిపారు. ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు ఏర్పాటు చేశామని వివరించారు. వైఎస్సార్ జలకళ ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేయించడంతో పాటు సన్న, చిన్నకారు రైతులకు మోటార్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. పాడి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అమూల్ సంస్థను తీసుకొచ్చామని చెప్పారు.