క‌రోనా నుంచి కోలుకున్నాను.. కొవిడ్-19ని చాలా సీరియ‌స్‌గా తీసుకోవాలి: జూనియ‌ర్ ఎన్టీఆర్

  • నేను కోలుకోవాల‌ని కోరుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృతజ్ఞ‌త‌లు
  • జాగ్ర‌త్త‌లు, సానుకూల దృక్ప‌థంతో ఈ వ్యాధిని జ‌యించ‌వ‌చ్చు
  • దీనిపై పోరాటంలో మ‌న సంకల్ప బ‌ల‌మే మ‌న అతిపెద్ద ఆయుధం
  • ధైర్యంగా ఉండండి.. భ‌య‌ప‌డ‌కూడ‌దు
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విష‌యం తెలిసిందే. డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ చికిత్స తీసుకున్న ఆయ‌న క‌రోనా నుంచి కోలుకున్నాడు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్లు చేశాడు.

'టెస్టు చేయించుకోగా క‌రోనా నెగ‌టివ్‌గా తేలింది. నేను కోలుకోవాల‌ని కోరుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృతజ్ఞ‌త‌లు. నాకు చికిత్స అందించిన డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుల‌క‌ర్ణి, నా క‌జిన్, కిమ్స్ డాక్ట‌ర్ వీరుకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను. అలాగే, టెనెట్ డ‌యాగ్న‌స్టిక్స్ కి కూడా థ్యాంక్స్. నా ఆరోగ్యం గురించి వారు తీసుకున్న శ్ర‌ద్ధ నేను కోలుకోవ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డింది' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

'కొవిడ్-19ని చాలా సీరియ‌స్‌గా తీసుకోవాల్సి ఉంది. అలాగే, జాగ్ర‌త్త‌లు, సానుకూల దృక్ప‌థంతో ఈ వ్యాధిని జ‌యించ‌వ‌చ్చు. దీనిపై పోరాటంలో మ‌న సంకల్ప బ‌ల‌మే మ‌న అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భ‌య‌ప‌డ‌కూడ‌దు. మాస్కులు ధ‌రించండి.. ఇంట్లోనే ఉండండి' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. 


More Telugu News