మరో మూడు రోజులు చికిత్స అందించాలని కోరిన రఘురామకృష్ణరాజు
- ఇప్పటికే సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
- నేరుగా ఆసుపత్రి నుంచి విడుదల చేయించాలని న్యాయవాదుల ప్రయత్నం
- కాళ్ల నొప్పితో బాధపడుతున్నానన్న రఘురామ
- ఆసుపత్రి కమాండెంట్‌కు లేఖ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేరుగా ఆసుపత్రి నుంచి విడుదల చేయించాలని ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. రఘురామ ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఆయనకు డాక్టర్ సేన్ గుప్తా, డాక్టర్ ఫిలిప్ పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.
తీవ్రమైన కాళ్ల నొప్పితో బాధపడుతున్నానని రఘురామ కృష్ణరాజు చెబుతున్నారు. అలాగే, ఒంట్లో మగతగా ఉంటోందని ఆయన వైద్యులకు చెప్పారు. తనకు రెండు, మూడు రోజులు మిలటరీ ఆసుపత్రిలోనే వైద్యం అందించాలని నిన్న ఆ ఆసుపత్రి కమాండెంట్‌కు ఆయన లేఖ రాశారు. అంతేగాకుండా, తన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని తెలిపారు.