కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల
- కరోనా బాధ్యతను కేసీఆర్ దొర వదిలించుకున్నారు
- ప్రజలపై ప్రతిరోజు రూ. 150 కోట్ల భారం పడుతోంది
- ఆసుపత్రుల దోపిడీతో ప్రజల బతుకులు బజారున పడుతున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ షర్మిల విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై ఆమె విరుచుకుపడ్డారు. కరోనా బాధ్యతను కేసీఆర్ దొర వదిలించుకోవడంతో... ప్రజల మీద ప్రతి రోజు రూ. 150 కోట్ల భారం పడుతోందని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీతో ప్రజల బతుకులు బజారున పడుతున్నాయని విమర్శించారు.
ఉన్నోడు పేదోడైపోతున్నాడని... కాస్తోకూస్తో సంపాదించినోడు ప్రాణాలు నిలుపుకోవడానికి ఉన్నదంతా ఖర్చు పెడుతున్నాడని షర్మిల అన్నారు. ఏమీ లేనోడు అప్పులు చేసి ఆగమవ్వడమో... ఉన్న భూమి జాగాను అమ్ముకుని, అప్పులు ఎట్లా కట్టుడో చంద్రశేఖరా అని మొత్తుకుంటున్నారని చెప్పారు. 'అయ్యా కేసీఆర్ సారూ... ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి... పేదలు అప్పుల బారిన పడుకుండా చూడు' అని ట్వీట్ చేశారు.