కరోనా దేవిని సృష్టించిన గ్రామస్థులు.. అచ్చం ఓ హీరోయిన్‌లా ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
- కోయంబత్తూరు జిల్లాలో కరోనా దేవి విగ్రహం
- కరోనా దేవికి నిత్య పూజలు
- సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్
- తనకు పంపారని వనితా విజయ్ కుమార్ ట్వీట్
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో ఓ గ్రామంలోని ప్రజలు కరోనాకు విగ్రహం నిర్మించి, దానికి కరోనా దేవి అని పేరు పెట్టి నిత్య పూజలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ కరోనా దేవి రూపాన్ని ఓ హీరోయిన్‌తో పోల్చుతూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కరోనా దేవి ముఖం, హీరోయిన్ వనితా విజయ్ కుమార్ ముఖం ఒకేలా ఉన్నాయని చెబుతూ మీమ్స్ రూపొందిస్తున్నారు. కొందరు వీటిని వనితా విజయ్ కుమార్ కు పంపడంతో ఆమె దీనిపై స్పందించింది. ప్రతి ఒక్కరూ ఈ ఫొటోతో పాటు మీమ్స్ పంపుతున్నారంటూ ఆమె ఆ ఫొటోను పోస్ట్ చేసింది.