తుపాను నేపథ్యంలో... అమిత్ షాతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిన ఏపీ సీఎం జ‌గ‌న్

  • య‌స్ తుపాను దృష్ట్యా చ‌ర్చ‌
  • పాల్గొన్న ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు
  • తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అమిత్ షా సూచ‌న‌లు
య‌స్ తుపాను ప్ర‌భావిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, అధికారుల‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి ఇందులో పాల్గొన్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. అమిత్ షాతో మాట్లాడి ప‌లు వివ‌రాలు తెలిపారు.

తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అమిత్ షా ఆయా రాష్ట్రాల‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. కాగా, ఈ స‌మావేశంలో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్, అండ‌మాన్ నికోబార్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ దేవేంద్ర కుమార్ జోషి కూడా పాల్గొన్నారు. అలాగే, ఏపీ, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌,  అండ‌మాన్ నికోబార్  అధికారులు కూడా పాల్గొన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, నేటి నుంచి ఈ నెల‌ 29 వరకు 25 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు రైల్వే తెలిపింది.


More Telugu News