దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి జనార్దన్‌రెడ్డిపై కేసులా?: చంద్రబాబు
- జనార్దన్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు
- టీడీపీ నేతల అక్రమ అరెస్టులపైనే జగన్ దృష్టి
- బేషరతుగా విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్
బనగానపల్లెకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే జగన్ మాత్రం టీడీపీ నేతల అరెస్ట్‌పై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనార్దన్‌రెడ్డి, ఇతర నేతల అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు చెప్పారు.
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. వైసీపీ పాలన మూడు అక్రమ కేసులు, ఆరు అరాచకాలుగా సాగుతోందన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టి జనార్దన్‌రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.