కక్ష సాధింపు పనిలో వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు: లోకేశ్
- సహజీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తున్నారు
- ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు
- గతంలో చేసిన తప్పులకు పదుల సంఖ్యలో అధికారులు జైలుకి వెళ్లారు
- ఇప్పటి పనులకు వందల సంఖ్యలో జైలుకు పోవడం ఖాయం
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'సహ జీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారు వైఎస్ జగన్ . తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.
'అక్రమ కేసులు నిలవవు అని తెలిసినా ప్రతిపక్ష నేతల్ని వెంటాడి, వేధించి జైలుకి పంపి జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు. గతంలో చేసిన తప్పులకు పదుల సంఖ్యలో అధికారులు జైలుకి వెళ్లారు. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనులకు వందల సంఖ్యలో అధికారులు జైలుకు పోవడం ఖాయం' అని లోకేశ్ హెచ్చరించారు. అక్రమ కేసులు ఉపసంహరించుకొని బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.