టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు

  • జనార్దన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
  • టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
  • డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • నేడు ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లెకు చెందిన ఆయనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసినట్టు బనగానపల్లె పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరం జనార్దన్‌రెడ్డిని డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

మొదట కాటసాని రామిరెడ్డి అనుచరులు ముగ్గురు జనార్దన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో కనిపించగా, టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జనార్దన్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు ఆయనను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్నారు.


More Telugu News