చిక్కమగళూరులో.. దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించి మూత్రం తాగించిన ఎస్సై!

చిక్కమగళూరులో.. దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించి మూత్రం తాగించిన ఎస్సై!
  • మహిళకు ఫోన్ కాల్ వివాదంలో యువకుడికి చిత్రహింసలు
  • బలవంతంగా మూత్రం తాగించిన ఎస్సై
  • అట్రాసిటీ చట్టం కింద ఎస్సైపై ఎఫ్ఐఆర్ నమోదు
ఓ మహిళ ఫోన్‌కాల్‌కు సంబంధించిన వివాదంలో దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై అతడితో మూత్రం తాగించాడు. కర్ణాటకలోని చిక్కమగళూరులో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోనిబీదు ఎస్సై అర్జున్ పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా మూత్రం తాగించాడని బాధిత యువకుడు ఆరోపించాడు.

ఎస్సై తీరుపై భగ్గుమన్న దళిత సంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. యువకుడితో మూత్రం తాగించిన ఎస్సై అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదైందని, అట్రాసిటీ చట్టం కింద తప్పుగా నిర్బంధించడం, బెదిరింపు, అవమానానికి గురిచేయడం, హింసించడం వంటి అభియోగాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిని బదిలీ చేసినట్టు చెప్పారు.


More Telugu News