మీకు ప్రాణం విలువ తెలిస్తే సునీల్ ట్వీట్ కు ఎందుకు స్పందించలేదు?: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్
- కరోనా రోగి సునీల్ మరణం
- సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
- సునీల్ ట్యాగ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపణ
- నిరక్షరాస్యులు వేలమంది చనిపోతున్నారని వెల్లడి
- మీలాగా ఎవరూ ఉండరంటూ సీఎంపై విమర్శలు
సునీల్ అనే కరోనా రోగి మరణించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రాణం విలువ బాగా తెలిసిన జగన్ గారూ... మీరు పట్టించుకోకపోవడం వల్లే సునీల్ వంటి అభాగ్యులు ఇప్పటివరకు 10 వేల మందికి పైగా ప్రజలు కరోనాతో ప్రాణాలు వదిలారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయిన సునీల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కేజీహెచ్ కరోనా వార్డు నుంచే లైవ్ లో తన పరిస్థితిని వెలిబుచ్చాడని, ఆ ట్వీట్ ను సీఎం జగన్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసినా స్పందించలేదని ఆరోపించారు.
సునీల్ ఈ నెల 19న ప్రాణాలు వదిలాడని లోకేశ్ వెల్లడించారు. సునీల్ చదువుకున్నవాడు కాబట్టి ట్వీట్ ద్వారా అతడి పరిస్థితి తెలిసిందని.. నిరక్షరాస్యులు, కార్మికులు, పేదలు రోజూ వేలమంది మృత్యువుకు బలవుతూనే ఉన్నారని వివరించారు. ప్రాణం విలువ తెలిసినవారెవరూ మీలాగా స్పందించకుండా ఉండరు అంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు.