క్యాబినెట్ విస్తరణలో జోగి రమేశ్ కు పదవి ఖాయం: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • అసెంబ్లీ సమావేశాల్లో రఘురామపై జోగి రమేశ్ ఫైర్
  • జోగి రమేశ్ కు థ్యాంక్స్ చెప్పిన సీఎం జగన్
  • తిట్టినోళ్లకు పదవులన్న విష్ణుకుమార్ రాజు
  • రఘురామను కొట్టినోళ్లకు ప్రమోషన్లు ఇస్తారని వ్యాఖ్యలు
ఈ నెల 20న జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ శాసనసభ్యుడు జోగి రమేశ్ రెబెల్ ఎంపీ రఘురామపై నిప్పులు చెరగడం, సీఎం జగన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం అందరూ చూశారు. దీనిపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈసారి జరిగే ఏపీ క్యాబినెట్ విస్తరణలో జోగి రమేశ్ కు పదవి ఖాయం అని జోస్యం చెప్పారు. తిట్టినోళ్లకు పదవులు అని, అసెంబ్లీలో రఘురామను జోగి రమేశ్ బూతులు తిడితే సీఎం థ్యాంక్స్ చెప్పారని వివరించారు.

ఇక, కస్టడీలో రఘురామను కొట్టినవారికి కూడా పదోన్నతులు లభిస్తాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఒకవేళ రఘురామ జైలుకు వెళ్లుంటే మాత్రం అనుమానాస్పద స్థితిలో మరణించేవారని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. జగన్ అంటే తనకు గౌరవం అని, లేదంటే తనను కూడా లోపలేస్తారని చమత్కరించారు. రఘురామ ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై సీబీఐ విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.


More Telugu News