కరోనా ఎఫెక్ట్: వర్చువల్‌గానే టీడీపీ మహానాడు!

  • రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న పార్టీ
  • గతేడాది రెండు రోజులపాటు వర్చువల్‌గా మహానాడు
  • ఈసారి ఒక్క రోజుకే పరిమితం చేయాలని యోచన?
కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో గతేడాది లానే ఈసారి కూడా వర్చువల్‌గానే మహానాడును నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 నుంచి మూడు రోజులపాటు మహానాడును టీడీపీ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. కరోనా ఉద్ధృతంగా ఉండడంతో గతేడాది కూడా మహానాడును వర్చువల్‌గానే నిర్వహించి రెండు రోజుల్లో ముగించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఎక్కడున్నవారు అక్కడి నుంచే హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు ప్రసంగించారు.

కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతున్న నేపథ్యంలో ఈ సారి కూడా మహానాడును వర్చువల్‌గానే నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, గతేడాదిలానే రెండు రోజులపాటు నిర్వహించాలా? లేదంటే, 28న ఒక్క రోజుతోనే సరిపెట్టాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకునేందుకు రేపు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.


More Telugu News