ఆనందయ్య కరోనా మందుపై లోకాయుక్త విచారణ

  • ఆనందయ్య మందుపై ప్రభుత్వం చర్యలు
  • వివరాలు సేకరిస్తున్న ఆయుష్ అధికారులు
  • ఈ నెల 31న లోకాయుక్త విచారణ
  • నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై నిగ్గు తేల్చేందుకు ఆయుష్ వర్గాలు రంగంలోకి దిగాయి. మందుపై శాస్త్రీయ అధ్యయనం జరిగాకే పంపిణీ అంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, లోకాయుక్త కూడా ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఆనందయ్య కరోనా మందుపై ఈ నెల 31న విచారణ జరపనుంది. దీనికి హాజరు కావాలని నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించకూడదని లోకాయుక్త స్పష్టం చేసింది.

అటు, కృష్ణపట్నంలో పర్యటిస్తున్న ఆయుష్ అధికారులు ఆనందయ్య నుంచి మందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని ఆనందయ్య అధికారులకు వివరించారు. వివిధ పరీక్షల్లో ఆనందయ్య ఆయుర్వేద మందుపై సానుకూల ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆనందయ్యకు పూర్తిస్థాయిలో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు.


More Telugu News