బాబా రాందేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలి: ఐఎంఏ డిమాండ్

  • కరోనా చికిత్సకు అల్లోపతి పనికిరాదన్న రాందేవ్
  • రాందేవ్ పై ఐఎంఏ ఆగ్రహం
  • స్వలాభం కోసం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు
  • చర్యలు తీసుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరిక
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికిరాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ, స్వప్రయోజనాల కోసం విపరీత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది.

 బాబా రాందేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని కేంద్రానికి తేల్చి చెప్పింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఐఎంఏ హెచ్చరించింది.


More Telugu News