విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా మృతి
- గుండెపోటుతో మృతి చెందిన సురేశ్ బాత్రా
- ఆయన వయసు 53 ఏళ్లు
- కోహ్లీ బ్యాటింగ్ నైపుణ్యం వెనుక సురేశ్ ది కీలక పాత్ర
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 ఏళ్లు. ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అకాడెమీలో అసిస్టెంట్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. కోహ్లీ బ్యాటింగ్ లో నైపుణ్యం పెరగడం వెనుక సురేశ్ పాత్ర ఎంతో ఉంది. ఢిల్లీ టీమ్ నుంచి భారత జట్టులోకి వచ్చిన ఎంతో మంది క్రికెటర్ల వెనుక సురేశ్ కోచింగ్ నైపుణ్యం ఉంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం సన్నద్ధమవుతున్న కోహ్లీకి... తన చిన్ననాటి కోచ్ మరణం షాక్ కలిగించే విషయమే.
మరోవైపు సురేశ్ మరణంపై ఢిల్లీ క్రికెట్ అకాడెమీ హెడ్ కోచ్ రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ... ఈరోజు తాను తన తమ్ముడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 1995 నుంచి సురేశ్ తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. రాజ్ కుమార్ శర్మ కూడా కోహ్లీకి కోచ్ గా వ్యవహరించడం గమనార్హం. సురేశ్ మరణం పట్ల పలువురు క్రికెటర్లు, క్రికెట్ అధికారులు సంతాపాన్ని ప్రకటించారు.