బాలయ్యను మెప్పించిన తమన్!
- 'క్రాక్' సినిమాతో హిట్ ఇచ్చిన తమన్
- 'అఖండ' మూవీకి ఆయనే సంగీత దర్శకుడు
- ఇద్దరి కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు
ఈ మధ్య కాలంలో తమన్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఆయన సంగీతాన్ని అందించిన సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఒక వైపున బాణీలు కట్టడంలోను .. మరో వైపున బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడంలోను ఆయన తన జోరును కొనసాగిస్తున్నాడు. దాంతో తమ సినిమాలు ఆయనతో చేయించడానికే స్టార్ హీరోలు .. డైరెక్టర్లు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్న ప్రాజెక్టు కూడా తమన్ చేతికే వచ్చినట్టుగా తెలుస్తోంది.
'క్రాక్' సినిమాతో గోపీచంద్ మలినేనికి తమన్ పెద్ద హిట్ ఇచ్చాడు. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. బాలకృష్ణ 'అఖండ'కు కూడా తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తమన్ పనితనం నచ్చిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో చేయనున్న సినిమాకి కూడా తమన్ పేరునే సూచించారట. ఆల్రెడీ 'క్రాక్' సినిమాకి కూడా పని చేసి ఉండటం వలన, గోపీచంద్ మలినేని ఆయనను ఫైనల్ చేశాడని అంటున్నారు.