బీఏ రాజు మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది: పవన్ కల్యాణ్
- శుక్రవారం రాత్రి గుండెపోటుతో బీఏ రాజు మృతి
- ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న పవన్
- చెన్నైలో ఉన్నప్పటినుంచే అనుబంధం ఉందని వెల్లడి
- నిర్మాతగానూ రాణించారని వివరణ
నిర్మాత, పీఆర్వో బీఏ రాజు గతరాత్రి గుండెపోటుతో మరణించడం పట్ల అగ్రకథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. బీఏ రాజు హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. బీఏ రాజు జర్నలిస్టుగా, పీఆర్వోగా తెలుగు సినీరంగంలో చిరపరిచితులైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
"బీఏ రాజుతో చెన్నైలో ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆయన సినిమా అంటే ఎంతో తపన కలిగిన జర్నలిస్టు. మా అన్నయ్య చిరంజీవి నటించిన పలు చిత్రాలకు పీఆర్వోగా వ్యవహరించారు. 'సూపర్ హిట్' సినీ పత్రిక సంపాదకులుగానే కాకుండా నిర్మాతగానూ రాణించారు" అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఎ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.