ఇండియాలో 85 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ల ఉత్పత్తి: రష్యాలో భారత రాయబారి
- ఆగస్టు నుంచి మొదలు
- స్పుత్నిక్ టీకా 70% ఇక్కడే తయారీ
- ఈ నెలాఖరుకు 30 లక్షల ‘బల్క్’ డోసులు
- సీసాల్లోకి నింపి సరఫరా
ఇండియాలో 85 కోట్ల స్పుత్నిక్ వీ టీకాలను తయారు చేస్తామని రష్యాలో భారత రాయబారి డి.బి. వెంకటేశ్ వర్మ తెలిపారు. ఆగస్టు నుంచి ఉత్పత్తి మొదలవుతుందన్నారు. ప్రపంచంలో తయారయ్యే స్పుత్నిక్ వ్యాక్సిన్లలో 65 నుంచి 70 శాతం వరకు భారత్ లోనే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ఈ రోజు సెయింట్ పీటర్స్ బర్గ్ లో స్పుత్నిక్ టీకాలు, భారత్ లో కరోనా పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటిదాకా రష్యా నుంచి లక్షన్నర డోసులు అందాయని చెప్పారు. మే చివరి నాటికి 30 లక్షల డోసుల ‘బల్క్ వ్యాక్సిన్’ అందుతుందన్నారు. ఆ వ్యాక్సిన్ ను భారత్ లోనే సీసాల్లో నింపి మార్కెట్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆ సామర్థ్యాన్ని 50 లక్షలకు పెంచుతామని తెలిపారు. మూడు దశల్లో స్పుత్నిక్ ఉత్పత్తి జరుగుతుందన్నారు.
మొదటి దశలో రష్యాలో తయారై అక్కడే సీసాల్లో నింపిన వ్యాక్సిన్ల సరఫరా, బల్క్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చి దేశంలోనే సీసాల్లో నింపి సరఫరా, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ల సరఫరా అని ఆయన వివరించారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ లో స్పుత్నిక్ వ్యాక్సిన్లను డాక్టర్ రెడ్డీస్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.