కార్టూనిస్ట్ గోపి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- కుంచెతో అద్భుతమైన ప్రతిభను కనబరిచారన్న కేసీఆర్
- తెలంగాణ గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని ఆవేదన
- గోపి అసలు పేరు లూసగాని గోపాల్ గౌడ్
ప్రముఖ చిత్రకారుడు గోపి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఇల్లస్ట్రేటర్ గా, కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుతమైన ప్రతిభను కనబరిచారని సీఎం కొనియాడారు. తెలంగాణ ఒక గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు గోపి చిత్రకారుడిగా ప్రతిభను కనబరిచారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గోపి అసలు పేరు లూసగాని గోపాల్ గౌడ్.