గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా చ‌నిపోయింది 18 ల‌క్ష‌ల మంది కాదు.. 30 ల‌క్ష‌ల మంది: డ‌బ్ల్యూహెచ్‌వో

  • మ‌ర‌ణాల సంఖ్యపై ఆయా దేశాలు వెల్ల‌డించిన లెక్క‌లు స‌రిగ్గాలేవు
  • పాజిటివ్ నిర్ధార‌ణ అయి మృతి చెందిన వారి గ‌ణాంకాలే తీసుకున్నారు
  • క‌రోనా సోకిన‌ చాలా మందిని దేశాలు గుర్తించలేక‌పోయాయి
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. అయితే, 18 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే చ‌నిపోయార‌ని ప్ర‌పంచ దేశాల గ‌ణాంకాలు తెలుపుతున్నాయ‌ని, ఆయా దేశాలు మృతుల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపించాయ‌ని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

ఆయా దేశాలు వెల్ల‌డించిన గ‌ణాంకాల కంటే 12 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు అధికంగా సంభ‌వించి ఉండ‌వ‌చ్చ‌ని తెలిపింది. గత ఏడాది డిసెంబరు 31 నాటికి ప్రపంచ వ్యాప్తంగా న‌మోదైన‌ కరోనా కేసుల సంఖ్య 8.2 కోట్లగా ఉంద‌ని ఆయా దేశాల గ‌ణాంకాలు చెబుతున్నాయ‌ని తెలిపింది. కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించిన వారితో పాటు పాజిటివ్‌గా వ‌చ్చి ఇళ్ల‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి గ‌ణాంకాల‌నే ప్ర‌పంచ దేశాలు న‌మోదు చేశాయ‌ని తెలిపింది.

అయితే, క‌రోనా నిర్ధారణ సరిగా జరగకముందే మృతి చెందిన వారు చాలా మంది ఉన్నార‌ని, ఆ మృతుల సంఖ్య‌ను లెక్కల్లోకి తీసుకోలేదని వివ‌రించింది. మరోవైపు క‌రోనా సోక‌‌డం వ‌ల్ల మాత్ర‌మే కాకుండా ఆ సంక్షోభం కార‌ణంగా త‌లెత్తిన ప‌రిణామాల వ‌ల్ల కూడా చాలా మంది మృతిచెందార‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.


More Telugu News