ఫ్రంట్‌లైన్ వర్కర్ల సమావేశంలో మోదీ కంటతడి
- కరోనా మహమ్మారి ఆత్మీయులను బలితీసుకుంటోందని ఆవేదన
- బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
- ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్న మోదీ
ఫ్రంట్‌లైన్ వర్కర్లతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. కరోనా కారణంగా ఎంతోమంది ఆప్తులను కోల్పోయారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్టు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.
మనకు అత్యంత ప్రియమైన ఎంతోమందిని ఈ మహమ్మారి బలితీసుకుందని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మాటలు అంటున్నప్పుడు ప్రధాని స్వరం వణికింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేయడం కనిపించింది.
ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు జమాన్ బీమార్.. వహీన్ ఉపచార్ (రోగి ఎక్కడుంటే అక్కడే వైద్య సేవలు) అనేది ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తుందన్నారు. అందరం కలిసి కరోనా మహమ్మారిని కొంత వరకు నిలువరించగలిగామని, అయితే ఇది సంతృప్తి చెందే సమయం కాదని ప్రధాని అన్నారు. వైరస్‌పై దీర్ఘకాలం పోరాటం చేయాల్సి ఉందన్నారు. కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, వార్డ్ బాయ్‌లు, అంబులెన్స్ డ్రైవర్ల కృషిని ఈ సందర్బంగా ప్రధాని కొనియాడారు.