ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంఏ అజీజ్ కన్నుమూత

  • స్వస్థలం నిడదవోలు
  • 1978-83 మధ్య కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేసిన అజీజ్
  • చెన్నారెడ్డి మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా సేవలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంఏ అజీజ్ నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన అజీజ్ అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1978-1983 మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. నిడదవోలుకు చెందిన ఆయన 1983 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.


More Telugu News