ఆనందయ్య మందుపై పరిశీలన కోసం కృష్ణపట్నం చేరుకున్న ఐసీఎంఆర్ బృందం

  • కృష్ణపట్నంలో ఆనందయ్య మూలికా వైద్యం
  • కరోనాపై బాగా పనిచేస్తోందంటూ ప్రచారం
  • భారీగా తరలివస్తున్న ప్రజలు
  • ఆనందయ్య ఔషధం వివరాలు తెలుసుకున్న ఐసీఎంఆర్
  • చెట్ల ఆకులు, పదార్థాల పరిశీలన
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్న కరోనా ఔషధంపై పరిశీలన చేపట్టేందుకు ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం చేరుకుంది. ఆనందయ్య ఔషధం తయారీలో ఉపయోగించే చెట్ల ఆకులు, పదార్థాలను ఐసీఎంఆర్ బృందంలోని సభ్యులు పరిశీలించారు. ఔషధ తయారీ విధానాన్ని ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే కోణంలో ఆరా తీశారు. కాగా, ఐసీఎంఆర్ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మి కూడా ఉన్నారు.

కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మూలికా ఔషధం కరోనాను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తోందంటూ ప్రచారం జరగడంతో ప్రజలు పోటెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ ఔషధం సమర్థత తెలిసేదాకా పంపిణీ నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News