సీఎస్,ఎస్ఈసీల జీతాలతో ఎన్నికలు నిర్వహించాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- ఏపీలో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయి
- కరోనా రోగులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది
- ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలో వైసీపీ నేతల హస్తం ఉంది
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకపోవడం వల్లే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏపీ హైకోర్టు రద్దు చేసిందని బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కొత్తగా నిర్వహించే ఎన్నికలకు అయ్యే ఖర్చును సీఎస్, ఎస్ఈసీల నుంచి వసూలు చేయాలని చెప్పారు. ఏపీలో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని అన్నారు.
కరోనా రోగులను రక్షించడంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విష్ణు విమర్శించారు. కానీ వైసీపీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీలో ఎంతో మంది వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 514 ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్టు చెప్పుకుంటున్నారని... అయితే ఆ ఆసుపత్రుల్లో 10 శాతం బెడ్లు కూడా కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రెమ్ డెసివిర్, ఆక్సిజన్ ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడనికే ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటి వరకు ఒక్క ఆసుపత్రిని కూడా సందర్శించలేదని విమర్శించారు.