ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ మంత్రి, ఐసీఎంఆర్ డీజీలకు ఉపరాష్ట్రపతి సూచనలు

  • ఆనందయ్య కరోనా మందుకు విపరీతమైన డిమాండ్
  • కృష్ణపట్నంకు పోటెత్తుతున్న ప్రజలు
  • జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన వైనం
  • స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు చేశారు.

కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు.


More Telugu News