దూసుకుపోయిన మార్కెట్లు.. భారీగా లాభపడ్డ సెన్సెక్స్

  • 976 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 269 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4.5 శాతం వరకు లాభపడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు లాభాల్లో పయనించడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో, ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 976 పాయింట్లు లాభపడి 50,540కి చేరుకుంది. నిఫ్టీ 269 పాయింట్లు పెరిగి 15,175కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (4.48%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.18%), యాక్సిస్ బ్యాంక్ (3.51%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.89%).

మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం డాక్టర్ రెడ్డీస్ (-0.37%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.35%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి.


More Telugu News