ప్రముఖ పర్యావరణవేత్త సుందర్ లాల్ బహుగుణ కరోనాతో మృతి

  • ఇటీవలే బహుగుణకు కరోనా
  • ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత
  • విచారం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం
  • బహుగుణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో (నరికివేతను అడ్డుకుంటూ చెట్లను కౌగిలించుకోవడం) ఉద్యమ సృష్టికర్త సుందర్ లాల్ బహుగుణ కరోనాతో కన్నుమూశారు. ఇటీవలే కరోనా బారినపడిన సుందర్ లాల్ బహుగుణ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. కాగా,  సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

గత 5 దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపైనా, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణకు జీవితాంతం కృషి చేస్తూనే ఉన్నారని కొనియాడారు. పర్యావరణ అంశాలపై తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి,. జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. బహుగుణ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


More Telugu News