ఒక మంచి మనిషిని కోల్పోయాను: చిరంజీవి
- చిరు వీరాభిమాని యర్రా నాగబాబు కరోనాతో మృతి
- తన పిలుపు మేరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశాడన్న చిరంజీవి
- నాగబాబు చనిపోవడం బాధాకరమని ఆవేదన
సినీ నటుడు చిరంజీవి వీరాభిమాని యర్రా నాగబాబు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ వార్తతో చిరంజీవి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒక మంచి మనిషిని కోల్పోయానని ఆయన అన్నారు. యర్రా నాగబాబు తనకు వీరాభిమాని అని చెప్పారు. తన పిలుపు మేరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేసి, తాను గర్వపడేలా చేశాడని అన్నారు. తమ ఐ బ్యాంక్ ను ఆదర్శంగా తీసుకుని... కోనసీమ ఐ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడని కొనియాడారు. చూపు కోల్పోయిన ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించాడని చెప్పారు.
అంత మంచి మనిషి కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని చిరంజీవి అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను ఆయనతో మాట్లాడానని.... ఎంతో భరోసాగా మాట్లాడాడని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయనను కోల్పోయామని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 'మిస్ యూ నాగబాబు' అంటూ తన సంతాపాన్ని ప్రకటించారు.