అత్యాచారం కేసులో తరుణ్ తేజ్ పాల్ ను నిర్దోషిగా ప్రకటించిన గోవా కోర్టు

  • తనను వేధించారని తేజ్ పాల్ పై మహిళ ఫిర్యాదు
  • తేజ్ పాల్ పై అత్యాచారం, వేధింపుల కేసు
  • కేసును కొట్టేసిన గోవా కోర్టు
తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కు గోవా కోర్టులో ఊరట లభించింది. అత్యాచారం కేసులో ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేసు వివరాల్లోకి వెళ్లే 2013లో గోవాలోని ఓ ఫైవ్ స్టార్ రిసార్టులో ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారంటూ ఆయన సహచరురాలు కేసు పెట్టింది. దీంతో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

తేజ్ పాల్ పై ఆరోపణలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. తేజ్ పాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, గోవా కోర్టులోనే విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేథ్యంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవా కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం కేసును కొట్టేసింది.


More Telugu News