సుప్రీంకోర్టులో రఘురామ కుమారుడి పిటిషన్
- అక్రమంగా అరెస్ట్ చేశారు
- కస్టడీలో పోలీసులు హింసించారు
- అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగాలేదు
తన తండ్రి రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని పేర్కొంటూ ఆయన కుమారుడు భరత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ తో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ లో కోరారు. కస్టడీలో తన తండ్రిని వేధించారని... అమానుషంగా, చట్ట విరుద్ధంగా తీవ్రంగా హింసించారని... అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సీఎం జగన్, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ను ఈరోజు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.